• Neti Charithra

Breaking..బి కొత్తకోటవద్దస్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారుల దాడులు..భారీగా మద్యం పట్టివేత!


Breaking..బి కొత్తకోటవద్దస్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారుల దాడులు..భారీగా మద్యం పట్టివేత!



బి కొత్తకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా బి కొత్తకోట సమీపం లో రూ.2లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని స్పెషల్ బ్రాంచ్ బ్యూరో పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు.సీఐ ఫణీంద్ర కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం ఎనమలపడి నుండి బి కొత్తకోట మీదుగా వాల్మీకిపురం కు మద్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఎస్ ఈ బి అధికారులు నిఘా ఉంచారు. ఈ సందర్భంగా అనుమానాస్పద కారును వెంబడించి తనిఖీలు చేయగా అందులో కర్ణాటక మద్యం 81 ఫుల్ బాటిల్స్ 240 టెట్రా ప్యాకెట్లు పట్టుపడ్డాయి.



వాల్మీకిపురం మండలానికి చెందిన నరసింహులు, సునీల్ కుమార్ లను అరెస్ట్ చేసి రూ.2లక్షల ఖరీదైన కర్నాటక మద్యాన్ని సీజ్ చేసి మరో రెండు లక్షల ఖరీదైన వాహనాన్ని సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ ఐ రమా ప్రసాద్, సిబ్బంది కృష్ణ మూర్తి, దేవేంద్ర, రవీంద్ర, చలపతి లు పాల్గొన్నారు.