• Neti Charithra

Breaking...బి కొత్తకోట లో సీపీఐ ధర్నా..రాస్తా రోకో..!


Breaking...బి కొత్తకోట లో సీపీఐ

ధర్నా..రాస్తా రోకో..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో సీపీఐ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏడాది కాలంగా "కరోనా"మహమ్మారి "లాక్ డౌన్"లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి ప్రజలపై,పెట్రోలు,

డీజిల్,వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పెను భారాలు మోపుతున్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు,శుక్రవా రం

జ్యోతి చౌక్ నందు, సిపిఐ ఆధ్వర్యంలో

"ధర్నా" మరియు "రాస్తారోకో" కార్యక్రమం నిర్వహించారు. వంటగ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకొని,ప్లకార్డులు చేతబట్టి,ఆటోను తాళ్ళు కట్టి లాగుతూ వినూత్న పద్ధతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెంచిన వంటగ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని,కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి ఎస్. మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్. బషీర్ ఖాన్ లు మాట్లాడుతూ; అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గుతున్న సమయంలో,ఎక్సైజ్ సుంకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటూ పోవడం చాలా దారుణం అని అన్నారు.కరోనా మహమ్మారి తో ఉపాధి పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి ప్రజలకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గుదిబండగా మారాయని ఆవేదన చెందారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రవాణా వ్యయం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని,పేద మధ్యతరగతి ప్రజలు ఏమీ కొనలేని,ఏమీ తిన లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు.బడా బాబులకు కొమ్ము కాస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికయినా పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి బి.వేణుగోపాల్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి యస్. సలీంబాషా,మండల నాయకులు ఎమ్.అష్రఫ్ అల్లీ, యస్.శంశుద్దీన్, యస్.మహమ్మద్ ఖాసిం,యస్.షఫీ, యస్.గంగులప్ప,డి. బాబు,ఎస్.షఫీ, రియాజ్,హబీబ్, సామాజిక కార్యకర్త యస్.ఎస్.హైదర్ వల్లి మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.