• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో సీపీఐ ఆధ్వర్యంలో క్రోవోత్తుల ర్యాలీ..!


Breaking.. బి కొత్తకోట లో సీపీఐ

ఆధ్వర్యంలో క్రోవోత్తుల ర్యాలీ..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అమరజీవి "భగత్ సింగ్" గారి 90వ వర్ధంతిని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రాత్రి జ్యోతి చౌక్ నందు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు

వేసి,కొవ్వొత్తులను వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు జోహార్లు అంటూ, మీ యొక్క ఆశయాలు సాధిస్తాం అంటూ, విప్లవం వర్ధిల్లాలని, ఇంక్వి లాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్. మనోహర్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఎస్.సలీంబాషా, ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శిబి.వేణు గోపాల్ రెడ్డి,యస్.తంబయ్య శెట్టి, కార్మిక సంఘాల నాయకులు పీ. మంజునాథ్, జవహర్ బాబు, గంగులప్ప,దుమ్ము. బాబు,చౌడప్ప,ప్రసాద్, సోము,రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.