- Neti Charithra
Breaking..బి కొత్తకోట కేంద్రం గా నకిలీ ఆధార్..పాన్ కార్డుల తయారీ..దాడులు చేసిన అధికారులు..!
Breaking... బి కొత్తకోట
కేంద్రంగా నకిలీ ఆధార్..పాన్ కార్డుల తయారీ .. దాడులు చేసిన అధికారులు!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో విజిలెన్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్నెట్ సెంటర్ కేంద్రంగా పాన్ కార్డులు, ఆధార్ కార్డులు లో వయస్సు, ఇతర రికార్డులు మారుస్తున్న
నిర్వహకుణ్ణి పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట లో
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరం ఉన్న ఆధార్, పాన్ కార్డుల లలో వయస్సు లు మార్చుతున్నారన్న సమాచారం తో తిరుపతి విజిలెన్స్ పోలీస్ అధికారులు దాడులు చేయగా పాత పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న సరస్వతి ఇంటర్నెట్ సెంటర్ లో అక్రమంగా వయస్సులు మార్చేందుకు సిద్ధంగాఉన్న సుమారు 90 పాన్ కార్డులు, పలు ఆధార్ కార్డులు ను అలాగే వీటికి వినియోగిస్తున్న పలువురు
అధికారుల సీళ్ళు ను రెవిన్యూ మరియు గ్రామపంచాయతీ అధికారుల సమక్షం లో
స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్ నెట్ సెంటర్ నిర్వాహకుడు తాకటంవారిపల్లె కు చెందిన డేరింగు ల విశ్వనాథ్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ మీడియాకు వివరించారు.