• Neti Charithra

Breaking..బి కొత్తకోట లో మాతాజీ పూజలు..పేరుతో ఓ కుటుంబాన్ని మోసం చేసిన ఇద్దరి అరెస్ట్..!


Breaking..బి కొత్తకోట లో

మాతాజీ పూజలు..పేరుతో ఓ కుటుంబాన్ని మోసం చేసిన ఇద్దరి అరెస్ట్..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో మాతాజీ పూజలు పేరుతో మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ ఐ సునీల్ కుమార్ లు పేర్కొన్నారు. వారు మీడియా తో మాట్లాడుతూ రంగసముద్రం రోడ్ లో నివాసం ఉంటున్న ఆర్ ఎం పి వైద్యులు కృష్ణారెడ్డి, నిర్మల లకు ఇద్దరు అడ బిడ్డలు . వీరు వివిధ సమస్యలు తో మానసిక ఇబ్బందులు గురవుతుండగా వీరి

బలహీనతలు గుర్తించిన బి కొత్తకోట కు చెందిన బైరెడ్డి వెంకట్ రెడ్డి, చరణ్ లు కుటుంబాన్ని మోసగించి మాతాజీ పూజలు చేయిస్తామని నగలు తెమ్మని డబ్బు ఖర్చు చేయించి క్షుద్రపూజల చేయించి కుటుంబానికి చెందిన దోషాలు పోవాలంటే

మొదటి కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసిన జాహ్నవి కి తక్షణం పెళ్లి చేయాలని మోసాగించి మంచి ఉద్యోగంలో

ఉన్న యువకుడు చరణ్ అంటూ

యువతిని మోసం చేసి పెళ్లి చేసుకొని

తమ సొంత ఇంటిని ఆయువకులు జీపీఏ రాయించుకొని మోసం చేయడంతో బాధితులు తల్లి నిర్మల, కుమార్తె జాహ్నవి లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు బైరెడ్డి వెంకట్ రెడ్డి, చరణ్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్