• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో క్షుద్రపూజల..కల కలం.. తమను కాపాడాలని ..పోలీసులను ఆశ్రయించిన కుటుంబం..!


Breaking.. బి కొత్తకోట లో క్షుద్రపూజల..కల కలం.. తమను కాపాడాలని ..పోలీసులను ఆశ్రయించిన కుటుంబం..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో క్షుద్రపూజలు కారణంగా జరిగిన జంట హత్య ల కేసు దక్షిణాది రాష్ట్రాల్లో కల కలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా బి కొత్తకోట లో ను క్షుద్రపూజలు .. తో తాము తీవ్రంగా నష్ట పోతున్నామని తమకు న్యాయం చేయాలని ఓ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడం కల కలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట పట్టణం రంగసముద్రం రోడ్డు లో నివాసం ఉంటున్న ఆర్ ఎం పి వైద్యులు కృష్ణారెడ్డి, నిర్మల లకు ఇద్దరు కుమార్తెలు. వీరు కొంత కాలం ఆర్థిక, మానసిక, కుటుంబ సమస్యల తో కలత చెందుతున్నారు. అయితే వీరి బలహీనతలు గుర్తించిన కొందరు యువకులు ముఠా గా ఏర్పడి తమ కు తెలిసిన ఓ అదృశ్య శక్తి "మాతాజీ " మంత్ర శక్తి తో మీ కుటుంబం కష్టాలు నుంచి సులువుగా బయట పడతారని నమ్మబలికారు. ఇందుకు కొన్ని ఉదా హరణలు చెప్పినట్లు తెలుస్తోంది. వీటికోసం ఇంటి సమీపం లోని కల్యాణ మండపం వద్ద ఓ చెట్టుకు ముగ్గులు వేసి.. మంత్రాలు చేసి క్షుద్ర పూజలు చేశారు. మొదట ఆరోగ్య సమస్యలు నుంచి బయట పడతారని, ఆతర్వాత ఆర్థిక సమస్యలు కుదుట పడతాయని, చెప్పటం తో కొంత డబ్బును ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆతర్వాత ఇంట్లో తమ కుమార్తెకు ( ఎంబీబీఎస్ చేసిన పెద్ద కుమార్తె) కు తక్షణం పెళ్ళి చేయాలని సూచించి ..అందుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించి..

చరణ్ అనే యువకుడి ని పరిచయం చేసి వారిని ఈ ఊబిలో కి దించినట్లు తెలుస్తోంది. ఆతర్వాత ఇంట్లో దోషం ఉందని అది తాము చెప్పిన వారి పేరున జీపీ రాయించుకున్నట్లు సమాచారం. పెద్దమ్మాయి పెళ్లి చేసుకున్న చరణ్ మాతాజి ముఠా లో సభ్యుడు కావడం విశేషం. ఇప్పుడు తమ బిడ్డను మరింత ఆస్తి, కట్నం పేరుతో వేదిస్తున్నట్లు ..కుమార్తె తో పాటు తల్లి తండ్రులు పోలీసులను ఆశ్రయించడం తో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. బైరెడ్డి వెంకట్ రెడ్డి, మరో

యువకుడు చరణ్ పై ఎస్ ఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేశారు.


2,896 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon