• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో అర్ధరాత్రి..అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడ్డ ప్రజలు.. లక్షల్లో ఆస్తి నష్టం..!


Breaking.. బి కొత్తకోట లో అర్ధరాత్రి..అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడ్డ ప్రజలు.. లక్షల్లో ఆస్తి నష్టం..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో శనివారం అర్ధ రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగటం తో స్థానికులు ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బి కొత్తకోట పిటిఎం రోడ్ లోని ఎస్ బి ఐ బ్యాంక్ సమీపం లో శనివారం రాత్రి

11గంటల తర్వాత ఒక్కసారిగా గుజరి గోడౌన్ లో మంటలు లేచి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా బ్యారిగా మంటలు ఎగిసి పడటం తో పరిసరాలలో నివసిస్తున్న కుటుంబాలు భయంతో ఉలిక్కిపడ్డారు. జాతీయ బ్యాంక్ కు అనుకోని ప్రమాదం జరగడం తో అధికారులు సైతం హైరానా పడ్డారు. సమాచారం అందుకున్న ములకలచెరువు అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సుమారు రూ. 5 లక్షల సామగ్రి ప్లాస్టిక్ పైపులు, డ్రిప్

పరికరాలు, తదితర నిల్వలు బి7డిదా అయ్యాయి అని బాధితులు తెలిపారు. స్థానిక పోలీసులు సైతం అక్కడికి చేరుకొని ప్రమాదం పై విచారణ చేపట్టారు. ఈ అగ్నిప్రమాదం పొరపాటున జరిగిందా.. లేక ఎవరైనా నిప్పు పెట్టారా .. అన్న విషయం తెలియాల్సివుంది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్