• Neti Charithra

Breaking..బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ గా లోకేశ్వర్ వర్మ ను నియమించిన ప్రభుత్వం..!


Breaking..బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ గా లోకేశ్వర్ వర్మ ను నియమించిన ప్రభుత్వం..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట నగర పంచాయతి ఇంచార్జ్ గా పుంగనూరు మున్సిపల్ కమిషనర్

లోకేశ్వర్ వర్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీ గా ఉన్న బి కొత్తకోట ను నగర పంచాయతీ గా ప్రభుత్వం ఇటీవల అప్ గ్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో పుంగనూరు కమిషనర్

లోకేశ్వర్ వర్మ ను ఇంచార్జ్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి సమక్షం లో ఆయనకు ఎంపీడీఓ సుధాకర్, ఈఓ పవన్ కుమార్ లు బాధ్యతలు అప్పజెప్పారు.

అందరి సహకారంతో అభివృద్ధి పరుస్తాం..!


బి కొత్తకోట నగర పంచాయతీ ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్వర్

వర్మ మీడియా తో మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో బి కొత్తకోట ను అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని అలాగే ప్రజల సహకారం.. ఉద్యోగులు అంకిత భావం తో విధుల నిర్వహణ ఎంతో ముఖ్యం అన్నారు.

అధికారులు..నేతల అభినందనలు..!బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్వర్ వర్మ

కు ఎంపీడీఓ సుధాకర్, ఈఓ పవన్ కుమార్, ఎంఇఓ రెడ్డి శేఖర్, పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులుతో పాటు మాజీ వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు బి కొత్తకోట సహకార సొసైటీ అధ్యక్షులు తిరుమల అమర నాథ్, బి కొత్తకోట హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు బలరాం రెడ్డి, రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు శశి భూషణ్, మాజీ కో అప్షన్ సభ్యులు బావజాన్, మాజీ ఉప సర్పంచ్ మాలిక్, ఎస్ అయ్యుబ్, రాయల్ సలీమ్, రియసత్ అలీఖాన్, నగిన తదితరులు పాల్గొన్నారు