• Neti Charithra

Breaking..బి కొత్తకోట నగర పంచాయతీ..ఎన్నికలకు 10 వ తేదీ లోగా ఓటర్ లిస్టు సిద్ధంచేయండి- కమిషనర్ ఆదేశం


Breaking... బి కొత్తకోట నగర పంచాయతీ.. ఎన్నికలకు 10 వ తేదీ లోగా ఓటర్ లిస్టు సిద్ధం చేయండి- కమిషనర్ ఆదేశం..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట నగర పంచాయతీ లో వార్డుల విభజనకు అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని బి కొత్తకోట నగర పంచాయతి కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక నగర పంచాయతీ కార్యాలయం లో పాలనా పర సౌలభ్యం కోసం మదనపల్లె, పుంగనూరు మున్సిపల్


( బి కొత్తకోట లో డివిజన్ వార్డులు సిద్ధం చేయాలని సిబ్బందికి సూచనలు ఇస్తున్న కమిషనర్ లోకేశ్వర్ వర్మ)


కార్యాలయాల నుంచి ఐదుగురు సిబ్బందిని బి కొత్తకోట నగర పంచాయతీ కి

కేటాయించారు. అనంతరం

పలు శాఖల అధికారులతో సిబ్బంది తో

ఆయన సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు లో భాగంగా ఈ నెల 4 లోగా డివిజన్ ల విభజన చేసి ఓటర్ల కేటాయింపు జరగాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. 5 నుంచి 10 వ తేదీ వరకు కొత్త డివిజన్ ల ఓటర్ లిస్టు ను తహసిల్దార్, ఎంపీడీఓ, నగర పంచాయతీ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల ఎదుట ప్రదర్శించాలని ఆదేశించారు. అభ్యంతరాల పై తుది నివేదిక ప్రకటిస్తామని మో త్తం 20 డివిజన్ లను ఏర్పాటుకు ఆయన సూచించారు. సమావేశంలో ఈఓ పవన్ కుమార్, వీఆర్వోలు, సచివాలయ ల సిబ్బంది పాల్గొన్నారు