• Neti Charithra

Breaking.. బి కొత్తకోట ఆర్టీసీ డిపోకు.. వర్ధంతి నిర్వహించిన పలు పార్టీల నాయకులు..!


Breaking..

బి కొత్తకోట ఆర్టీసీ డిపోకు.. వర్ధంతి నిర్వహించిన పలు పార్టీల నాయకులు..!
బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో పలు రాజకీయ పార్టీల నేతలు రద్దైన బి కొత్తకోట ఆర్టీసి డిపో

గురువారం రద్దైన ఆర్టీసీ డిపో కు వర్ధంతి

కార్యక్రమాలు నిర్వహించారు.

బి కొత్తకోట ఆర్టీసీ డిపోను నష్టాల సాకుతో మూసివేసి నేటికి 14 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా,ప్రతి ఏటా నిర్వహించే నిరసనలో భాగంగా, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో, గురువారం స్థానిక జ్యోతిచౌక్ నందు,వినూత్న పద్ధతిలో "14 సంవత్సరాల వర్ధంతి" కార్యక్రమాన్ని నిర్వహించారు.డిపో మూసివేత సందర్భంగా ఆనాడు పలు రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు కలిసి పదిహేను రోజులపాటు నిర్వహించిన ఆందోళనల కార్యక్రమాల

వార్తలను ప్రచురించిన వివిధ పత్రికల క్లిపింగ్స్ తో కూడిన బ్యానర్ ను ప్రదర్శించి,ఆర్టీసీ బస్సు ఫోటో కు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన పట్టణ ప్రజలు మన ఊరి డిపో మూసివేసి అప్పుడే 14 సంవత్సరాలు అయిందా!అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసి నిర్వాహకులను అభినందించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గపు ఇన్చార్జ్ ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్. మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ; 2006 సంవత్సరం లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ,రాష్ట్ర వ్యాప్తంగా నష్టాలలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలు మూసివేయాలని నిర్ణయించి,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 14 డిపోలను మూసివేశారని, అందులోని కొన్నింటిని తిరిగి పునఃప్రారంభించారు గానీ, బి.కొత్తకోట డిపోను మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగళ్ళు లో జరిగిన జన్మభూమి కార్యక్రమం సభలో బి.కొత్తకోట డిపోను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా కూడా కార్యరూపం దాల్చలేదని ఆవేదనచెందారు. అప్పటి ప్రతిపక్షంలో ని వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా అప్పుడు జరిగిన ఆందోళనల్లో పాల్గొని,మేము అధికారంలోకి వస్తే బి.కొత్తకోట డిపోను పునఃప్రారంభి స్తామని హామీ ఇచ్చారని,అయితే అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వాపోయారు. శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక చొరవ చూపి డిపోను పునః ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ సీనియర్ నాయకులు యస్.బషీర్ ఖాన్,బాస్ జిల్లా ఉపాధ్యక్షులు యస్.సచిన్ లు మాట్లాడుతూ; బి.కొత్తకోట ఆర్టీసీ డిపో లేనందున పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు వేళకు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసిన పరిస్థితులలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తున్నదని అన్నారు. రైతాంగం తాము పండించిన పంటలు అమ్ముకోవడానికి బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. ఏఐటియుసి జిల్లా నాయకులు బి.వేణుగోపాల్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి యస్.సలీం భాష లు మాట్లాడుతూ; బి.కొత్తకోట పట్టణం మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీగా మార్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, నియోజకవర్గం లోనే అతిపెద్ద జనాభా కలిగిన పట్టణంలో ఆర్టీసీ డిపోను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కే.కె.పల్లి.కృష్ణారెడ్డి, సిపిఐ నాయకులు ఎస్ మహమ్మద్ ఖాసీం, పి.నారాయణ స్వామి,యస్. షంషుద్దీన్,యస్.వల్లీసాబ్, గంగులప్ప, సామాజిక కార్యకర్త యస్.ఖాదర్ వల్లీ,రైతు నాయకులు బి.సుధాకర్,సి.వీ.రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు డీ.వేమనారాయన,బాస్ నరసింహులు, గోవర్ధన్,వెంకటేష్ మరియు ప్రజలు పాల్గొన్నారు.