• Neti Charithra

Breaking.. బి కొత్తకోటలో ఎన్నికల వేడి పుట్టింది..152 వార్డులకు పోలీస్ భద్రత మధ్యనామినేషన్ లు..!


Breaking.. బి కొత్తకోటలో ఎన్నికల వేడి పుట్టింది..152 వార్డులకు పోలీస్ భద్రత మధ్యనామినేషన్ లు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో 15 గ్రామ పంచాయతీ లలో152 వార్డులకు నామినేషన్ లకు మంగళ వారం నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంపీడీఓ కార్యాలయం లో గుమ్మసముద్రం,వేమిలేటి కోట, బీరంగి, గుడిపల్లె గ్రామ పంచాయతీ లకు సంబంధించిన నామినేషన్లు స్వీకరణ,

ఎంపీడీఓ మీటింగ్ హాల్ లో బడికాయ లపల్లె, సురపు వారిపల్లె, గట్టు,నాయన బావి, మోటుకు పల్లె గ్రామ పంచాయతీ ల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. అలాగే మండల సమాఖ్య కార్యాలయంలో తుమ్మనం గుట్ట, బండారు వారిపల్లె, గొల్లపల్లె ల గ్రామ పంచాయతీ అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, హౌసింగ్ కార్యాలయంలో బయప్పగారి పల్లె, శీలం వారిపల్లె, కోటావురు గ్రామ పంచాయతీ ల కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగనున్నట్లు ఎంపీడీఓ సుధాకర్ మీడియాకు వివరించారు.