- Neti Charithra
Breaking..బరి తెగించి న మావోయిస్టులు.. టిఆర్ఎస్ నేత దారుణ హత్య..!
Breaking..బరి తెగించి న మావోయిస్టులు.. టిఆర్ఎస్ నేత దారుణ హత్య..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
(హత్యకు గురైన భీమేశ్వర్ రావు)
టిఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. తెలంగాణ పరిధిలోని ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం
మేరకు.. భీమేశ్వరరావు ఇంట్లోకి ఆరుగురు మావోయిస్టులు చొరబడి, భీమేశ్వరరావును బయటకు లాక్కొచ్చారు. కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలం నుండి వెళ్లే ముందు మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు
పరిధిలో మావోయిస్టుల ఏరివేత దిశగా కూంబింగ్ ను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోయిస్టులు ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.