• Neti Charithra

Breaking.. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద భారీగా పట్టుపడ్డ నాటు బాంబులు..పోలీసులు అదుపు లి నిందితులు..!


Breaking.. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద భారీగా పట్టుపడ్డ నాటు బాంబులు..పోలీసులు అదుపు లి నిందితులు..!



శ్రీకాకుళం: నేటి చరిత్ర



శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు పట్టుపడటం తో స్థానికులు ఉలిక్కి పడ్డారు.

జిల్లాలోని మెలియాపుట్టిలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం

మెలియాపుట్టిలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన నిందితులను ఎర్ర రాజేష్, నవీన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ

బాంబులు ఎందుకు పెట్టారు..? ఎవరికోసం పెట్టారు..? ఈ ఇద్దరి వెనుక ఏమైనా గ్యాంగ్ ఉందా..? ఇంతకీ ఆ ఇద్దరు నిందితులు ఏ ప్రాంతానికి చెందిన వారు..? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.