• Neti Charithra

Breaking.. పెళ్ళి.. ఆయిన రెండు మాసాలకే.. యువ ఎస్ ఐ ఆత్మహత్య..కల కలం..!


Breaking.. పెళ్ళి.. ఆయిన రెండు మాసాలకే.. యువ ఎస్ ఐ ఆత్మహత్య..కల కలం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


పెళ్లి అయిన ..రెండు మాసాలు కే.. ఓ యువ ఎస్ ఐ ఇంట్లో ఉరి వేసుకొని ..ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్ శాఖలో కల కలం రేపిన ఘటన కృష్ణా జిల్లా లో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణాజిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలపై గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. రెండు నెలల క్రితం విజయ్ కుమార్‌కు వివాహమైంది. భార్యను కాపురానికి తీసుకురాకుండా, గుడివాడలో బ్యూటీషియన్‌తో కలిసి నివాసముంటున్నారు విజయ్ కుమార్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.


571 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon