• Neti Charithra

Breaking.. పెళ్లి రద్దు అయ్యిందని.. అమెరికాలో యువతి ఆత్మహత్య..చిత్తూరు లో విషాదం..!


Breaking.. పెళ్లి రద్దు అయ్యిందని.. అమెరికాలో యువతి ఆత్మహత్య..చిత్తూరు లో విషాదం..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరుకు చెందిన యువతి సుష్మా అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా లో విషాదాన్ని నింపింది.

చిత్తూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుష్మా అమెరికా లోని డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనిర్ గా కొనసాగుతోంది. సుష్మాకు చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ అనే యువకుడికి ఇటీవల



( డల్లాస్ లో ఆత్మహత్య చేసుకున్న యువతి సుష్మా)

వివాహ నిశ్చయం అయ్యింది. గురువారం

వీరి పెళ్లి చిత్తూరులో జరగాల్సిఉంది.

ఈ వివాహానికి చివరి నిముషం లో

భరత్ కుటుంబీకులు ససేమిరా అనడంతో వివాహ0 రద్దు అయ్యింది.

పెళ్లి రద్దుతో మూడు రోజులుగా తీవ్ర మనస్తాపంకు గురైన సుష్మా, అమెరికాలోని ఇంట్లో ఇవాళ ఆత్మహత్య చేసుకుంది.రెండు రోజుల్లో ఇండియాకు సుష్మా మృతదేహం వచ్చే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కాగ భరత్ కుటుంబీకులపై సుష్మా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.