• Neti Charithra

Breaking.. పెళ్లి బస్సు బోల్తా.. 20 మందికి ఆసుపత్రికి తరలింపు..!


Breaking.. పెళ్లి బస్సు బోల్తా.. 20 మందికి ఆసుపత్రికి తరలింపు..!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా రాష్ట్రంనాగర్‌కర్నూల్‌ జిల్లాలో పెళ్లి కి వెళుతున్న డీసీఎం వ్యాను బోల్తాపడింది. కొల్లాపూర్‌ మండలం రామాపురం వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో 20మందికి

గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో డీసీఎం వాహనంలో 65 మంది ఉన్నట్టు సమాచారం. వేగంగా వెళ్తున్న వాహనం రామాపురం గ్రామం సమీపంలో మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను కొల్లాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో పెళ్లి

కుమారుడు రాజు సురక్షితంగా బయటపడ్డాడు. రేపు ఉదయం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో రాజు వివాహం జరగనునన నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బాధితులంతా గద్వాల మండలం జమ్మిచెడుకు చెందినవారిగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.