• Neti Charithra

Breaking.. పెళ్లికి వెళ్లివస్తూ..ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న కారు.. చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం.


Breaking.. పెళ్లికి వెళ్లివస్తూ..ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న కారు.. చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం..! బంగారుపాళ్యం:నేటి చరిత్ర


వివాహ వేడుకలకు వెళ్లి వస్తూ.. జతోయ రహదారిపై అడ్డు వచ్జిన సునకాన్ని తప్పించబోయి.. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెను ఢీకొన్న కారు దగ్ధం ఆయిన ఘటన చిత్తూరు జిల్లా లో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారుపల్యం ఎస్ ఐ రామకృష్ణ కథనం మేరకు.. తమిళనాడులోని కాంచీపురం జిల్లా బాలాజీనగర్‌కు చెందిన సూర్యసాయికుమార్‌, అతడి భార్య శ్రీదేవి అనంతపురంలోని సోదరి గృహప్రవేశానికివెళ్లి కారులో స్వస్థలానికి పయనమయ్యారు. మార్గమధ్యలో

బంగారు పాళ్యం సమీపం


గుండ్లకట్టమంచి వద్దకు కారుకు అడ్డంగా వీధికుక్క వచ్చింది. దాన్ని తప్పించబోయి అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెను కారు

ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు తీవ్రతకు కారు దగ్ధం అయ్యింది. కారు లో ప్రయాణిస్తున్న సూర్యసాయికుమార్‌, ఆయన భార్య అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడ్డారు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. స్థానిక

పోలీసులు కేసు నమోదు చేశారు