• Neti Charithra

Breaking.. పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు..రూ.8 లక్షలు నగదు చోరీ చేశారు..!


Breaking.. పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు..రూ.8 లక్షలు నగదు చోరీ చేశారు..!



పక్చిమ గోదావరి: నేటి చరిత్ర


ఏదైనా చోరీ లు జరిగితే ఎవరైనా

పోలీసులను ఆశ్రయిస్తారు. ఇది సహజం . అయితే ఏకంగా పొలిస్ స్టేషన్ లో

లక్షలు నగదు చోరీకి గురైన ఘటన పక్చిమ గోదావరి లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వీరవాసరం, నౌడూరు, కొణితివాడ,

రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన డబ్బును సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ నెల 15వ తేదీ నుంచి బ్యాంకులకు సెలవు కావడంతో ఆయా దుకాణాల సిబ్బంది నగదును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోని ఓ లాకర్‌లో డబ్బును భద్రపరిచారు.

అయితే, బుధవారం బ్యాంకులు తెరుచుకోవడంతో డబ్బును జమ చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన దుకాణ సిబ్బంది లాక్ ఓపెన్ చేసి షాక్ తిన్నారు. అందులో డబ్బు కనిపించలేదు. మద్యం దుకాణాలకు సంబంధించిన రూ. 8,04,330 నగదు చోరీకి గురైనట్లు గ్రహించి వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

చోరీకి గురైన నగదులో వీరవాసరం మద్యం దుకాణానికి సంబంధించి రూ.1,50,000, నౌడూరు దుకాణం- రూ.2,16,060, కొణితివాడ దుకాణం- రూ.50,000, రాయకుదురు దుకాణానికి చెందిన రూ.3,88,270 ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.

ఈ ఘటన తో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కి పడ్డారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన భారీ చోరీ నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక బృందం రంగం లోకి దిగినట్లు అధికారులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్