- Neti Charithra
Breaking.. పోలీస్ స్టేషన్ కు అతి సమీపం లో ఏటీఎం ను కొల్ల గొట్టారు..లక్షలు దోచుకెళ్లారు..!
Breaking.. పోలీస్ స్టేషన్ కు అతి సమీపం లో ఏటీఎం ను కొల్ల గొట్టారు..లక్షలు దోచుకెళ్లారు..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎమ్ ను దుండగులు కొల్ల
గొట్టిన ఘటన సంచలనం కలిగించింది.
వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని ఏటీఎం సెంటర్లో గురువారం
రాత్రి చోరీ జరిగింది. ఇండిక్యాష్ ఏటీఎంలో గ్యాస్ కట్టర్‌తో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇటీవలే
రెండు సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈనెల 11న ఇక్కడే ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించారు. మళ్లీ గురువారం రాత్రి ఇండి క్యాష్ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేస్తున్నారు.
284 views0 comments