• Neti Charithra

Breaking..పోలీసులు..బరి తెగించారు.. హాస్టల్ లో బాలికలు చే ..నగ్నంగా డాన్స్ చేయించారు..!


Breaking..పోలీసులు..బరి తెగించారు.. హాస్టల్ లో బాలికలు చే ..నగ్నంగా

డాన్స్ చేయించారు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


పోలీసులు బరి తెగించారు.. విచారణ పేరుతో ఓ బాలికల హాస్టల్ కు వెళ్లిన పోలీసులు వారి చేత నగ్నంగా డాన్స్ చేయించిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్ర జలగావ్‌లోని హాస్టల్​లో ఉన్న బాలికలతో బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో బయటపడింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష

బీజేపీ నేతలు అసెంబ్లీ సమావేశంలో బుధవారం నిలదీశారు. పోలీసులు ఇంతటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించారు. జల్‌‌గావ్‌‌లో ప్రభుత్వ నేతృత్వంలోని ఆశాదీప్‌‌ మహిళల హాస్టల్​లో జరిగిందీ ఘటన. కొద్ది రోజుల కిందట పోలీసులు ఎంక్వైరీ పేరిట హాస్టల్​కి వెళ్లారు. అక్కడున్న బాలికలను బెదిరించి వారి బట్టలు విప్పించి డ్యాన్స్‌‌ చేయించారు. ఈ దారుణం గురించి తెలుసుకున్న ఓ ఎన్జీవో జిల్లా కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారన కు ఆదేశించింది.