• Neti Charithra

Breaking.. పోలీసుల దాడులు ..450 బస్తాల సబ్సిడీ బియ్యం..సీజ్..!


Breaking.. పోలీసుల దాడులు ..450 బస్తాల

సబ్సిడీ బియ్యం..సీజ్..!



నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా ను పోలీసులు అడ్డుకోవడంతో కృష్ణ జిల్లాలో

పెద్ద ఎత్తున బియ్యాన్ని పోలీసులు సీజ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో బందరు బైపాస్‌రోడ్డులో ఆదివారం తెల్లవారుజా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిలోని శ్మశానవాటికి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోడూరు నుంచి కాకినాడకు బియ్యం లోడుతో వెళుతున్న లారీని అధికారులు నిలువరించారు.

వాహనంలోని బియ్యం బస్తాలకు సంబంధించి వివరాలు కోరగా ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో అక్రమంగా రేషన్‌ తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో లారీలోని డ్రైవర్‌ శొంఠి సూరిబాబును, పోసిన సుధీర్‌, రాజారావులను చిలకలపూడి పోలీసుస్టేషన్‌ తీసుకువచ్చారు. వాహనంలోని బియ్యం బస్తాలను లెక్కించగా రూ.2,59,200 విలువైన 21,600 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని 450 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధరించారు. సివిల్‌ సప్లై డిప్యూటీ తహసీల్దారు మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజిలెన్స్‌ ఎస్‌ఐ శివరామకృష్ణ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్