• Neti Charithra

Breaking.. పోలీసుల తనిఖీలు..చిత్తూరు జిల్లా లో భారీగా పట్టుపడ్డ కర్ణాటక మద్యం..!


Breaking.. పోలీసుల తనిఖీలు..చిత్తూరు జిల్లా లో భారీగా పట్టుపడ్డ కర్ణాటక మద్యం..!
పలమనేరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో పోలీసుల దాడులు లో భారీ ఎత్తున్న రవాణా అవుతున్న కర్ణాటక మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో నిశాంత్ రెడ్డి , పలమనేరు డీఎస్పీ ఆరిఫుల్లా, సీఐ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో గంగవరం పోలీసులు రూ.6 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గంగవరం ఎస్‌ఐ

సుధాకరరెడ్డి బెంగళూరు-చెన్నై రహదారిలో తనిఖీ చేస్తున్న సమయాన గండ్రాజుపల్లె దగ్గర రెండు వాహనాల్లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిని గుర్తించారన్నారు. తిరుపతికి చెందిన హుస్సేన్‌బాషా, పసుపులేటి భార్గవ్‌.. కర్ణాటకకు చెందిన అర్జున్‌ సాయంతో మద్యం రవాణా చేస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. పెద్దఎత్తున కర్ణాటక మద్యం రవాణా అవుతోందని వచ్జిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.