• Neti Charithra

Breaking.. పోలీసుల ఆకస్మిక దాడులు.. చిత్తూరు జిల్లా లో 605 రేషన్ బస్తాల బియ్యం స్వాధీనం..!


Breaking.. పోలీసుల ఆకస్మిక దాడులు.. చిత్తూరు జిల్లా లో 605 రేషన్ బస్తాల బియ్యం స్వాధీనం..!తొట్టంబెడు: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా తొట్టంబెడు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న చెంచులక్ష్మి కాలనీ దగ్గర ఉన్న ఓ గోడౌన్ లో అక్రమంగా నిలువచేసిన సుమారు 30 టన్నులు వున్న 605 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడులు చేసి స్వాధీనం


చేసుకున్నారు.విజిలెన్స్ సిఐ లు మల్లికార్జున్, అబ్బన్న తమ సిబ్బందితో శ్రీకాళహస్తి నుంచి చెన్నైకి అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో దాడులు చేశారు.ఈ దాడుల్లో సుమారు 30 టన్నుల 605 రేషన్ బస్తాల బియ్యాన్ని గుర్తించి సివిల్ సప్లై గోడౌన్ కు తరలించారు.శ్రీకాళహస్తి టూటౌన్పోలీసుకు సమాచారం అందించారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న శ్రీకాళహస్తికి చెందిన ముగ్గురు వ్యక్తుల పేర్లను డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు, వీరిలో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా మరో ఇద్దరు పరారైనట్లు వివరించారు.ఈ బియ్యం అక్రమ తరలింపు లో శ్రీకాళహస్తికి చెందిన ఓ జనరల్ స్టోర్ యజమాని కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.డ్రైవర్ ని మాత్రం విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్

పోలీసులు తెలిపారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్