• Neti Charithra

Breaking.. పోలీసుల ఆకస్మిక దాడులు.. కోటి కి పైగా పట్టుపడ్డ ఎర్రచందనం..!


Breaking.. పోలీసుల ఆకస్మిక దాడులు.. కోటి కి పైగా పట్టుపడ్డ ఎర్రచందనం..!



కడప: నేటి చరిత్ర


కడప జిల్లా లో పోలీసులు .. అటవీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో కోటి రూపాయలు విలువైన ఎర్ర చందనం దుంగలను అధికారులు సీజ్ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

పుల్లంపేట మండలం వత్తలూరు, తిప్పాయపల్లె ప్రాంతాల్లో గురువారం పోలీసులు, అటవీశాఖాధికారులు దాడులు చేసి 116 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట డీఎఫ్‌వో వెంకటనరసయ్య, పుల్లంపేట ఎస్‌.ఐ.వినోద్‌కుమార్‌ తెలిపారు. వత్తలూరు పరిధిలోని గాలేరు- నగరి కాలువ ఎగువ ప్రాంతంలో స్మగ్లర్లు అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 70 దుంగలను పోలీసులు పట్టుకుని పుల్లంపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. తిప్పాయపల్లె ప్రాంతంలో నిల్వ చేసిన 46 దుంగలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకుని రాజంపేట రేంజర్‌ కార్యాలయానికి తరలించారు. పట్టుపడిన దుంగల విలువ రూ.కోటికిపైగా ఉంటుందని అధికారులు తెలిపారు.