• Neti Charithra

Breaking..పోలీసుల అత్యుత్సహం పై.. సీరియస్ అయిన ప్రభుత్వం.. ఆరుగురు పోలీసులపై వేటు..!



Breaking.. పోలీసుల అత్యుత్సహం పై.. సీరియస్ అయిన ప్రభుత్వం.. ఆరుగురు పోలీసులపై వేటు..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)



ఏపీ పోలీసుల అత్యుత్సహం .. పెను వివాదాలకు కారణం కావటం తో ఆరుగురు

పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజధాని ఉద్యమం సమయంలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడం పెను

దుమారంగా మారింది. రైతన్నలకే బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని సీరియస్‌ అయ్యారు. 43 మంది అమరావతి రైతులను నరసరావుపేట సబ్‌జైలు నుంచి జిల్లా జైలుకు తరలించే సమయంలో చేతికి

సంకెళ్లు వేయడం జాతీయస్థాయిలో పెనుదుమారాన్ని రేపుతోంది. అమరావతి ఉద్యమానికి పోటీగా ఆటోల్లో కొంతమందిని తీసుకొచ్చి…మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమం మొదలు పెట్టారు. మూడు రాజధానుల అనుకూలంగా వేరే ఊరి నుంచి రాజధానికి వచ్చి హడావిడి చేస్తున్న వారిని రైతులు అడ్డుకున్నారు. అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేట ప్రత్యేక మొబైల్‌ కోర్టు ఉత్తర్వుల మేరకు వివిధ కేసులలో రిమాండు ఖైదీలుగా ఉన్న 43 మంది ముద్దాయిలను మంగళవారం నరసరావుపేట సబ్‌జైలు నుంచి జిల్లా జైలుకు తరలించే క్రమంలో ఖైదీలకు బేడీలు వేయడంపై ఎస్పీ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై విశాల్‌ గున్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న ఆరుగురు హెడ్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశామని, ఆర్‌ఎస్సై, ఆర్‌ఐలకు ఛార్జ్‌ మెమోలు జారీచేశామని విశాల్‌ గున్ని తెలిపారు.