• Neti Charithra

Breaking..పోలీసులపై..రాళ్ల తో దాడి..చేసిన స్మగ్లర్ లు చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుపడ్డ ఎర్రచందనం!


Breaking.. పోలీసులపై..రాళ్ల తో దాడి..చేసిన స్మగ్లర్ లు చిత్తూరు జిల్లాలో

భారీగా పట్టుపడ్డ ఎర్రచందనం..!


తిరుపతి-నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తిరుపతి సమీపం

మంగళంరోడ్డులోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి భారీగా ఎర్రచందనం దుంగలు ను స్వాధీనం చేసుకున్నారు.

భూపాల్‌ కాలనీ వెనుక వైపు ఉన్న అడవుల నుండి ఎర్రచందనం మొద్దులను

తరలిస్తున్న స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక కారును, అందులోని వస్తువులనూ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డిఎస్‌పిలు కెసి

వెంకటయ్య, వివి గిరిధర్‌, మురళీధర్‌ల నేతఅత్వంలో ఆర్‌ఎస్‌ఐలు వాసు, సురేష్‌, డిఆర్‌ఒ నరసింహరావు టీమ్‌ శుక్రవారం రాత్రి నుండి కరకంబాడీ రోడ్డులోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టింది. శనివారం ఉదయం 4గంటల సమయంలో కొంతమంది తమిళులు ఎర్రచందనం దుంగలతో వస్తూ కనిపించారు. దీంతో వాసు బృందం వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. అయితే స్మగ్లర్లు దుంగలను పడవేసి, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందిపై రాళ్లు రువ్వారు. పోలీసులు తుపాకులతో ముందుకు వెళ్లగా స్మగ్లర్లు పారిపోయారు. సమీపంలో ఉన్న వారి వాహనంలో అప్పటికే కొన్ని ఎర్రచందనం దుంగలు కనిపించాయి. ఇంకా స్మగ్లర్లు మరోసారి అడవుల్లోకి వెళ్లేందుకు అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా ఉన్నాయి. అందులో పేకముక్కలు కూడా కనిపించడం విశేషం. సంఘటనా స్థలానికి డిఎస్‌పిలు వెంకటయ్య, మురళీధర్‌, ఆర్‌ఐ భాస్కర్‌, సిఐ వెంకట రవి, ఎఫ్‌ఆర్‌ఒ ప్రసాద్‌ చేరుకున్నారు. డిఎస్‌పి వెంకటయ్య మాట్లాడుతూ నాణ్యమైన ఎర్రచందనం తబలా తరహా దుంగలు అరుదుగా లభిస్తాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్‌ కొనసాగుతోందని తెలిపారు. సిఐ సుబ్రమణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.