- Neti Charithra
Breaking.. పోలీస్ ను మోసం చేసి..రూ.25 లక్షలు దోచేశారు..!
Breaking.. పోలీస్ ను మోసం చేసి..రూ.25 లక్షలు దోచేశారు..!
రాజంపేట: నేటి చరిత్ర
కడప జిల్లా రాజంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్‌రెడ్డిని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో కొందరు మోసం చేసి రూ. 25 లక్షలు కాజేశారు. ఆర్నెళ్ల నుంచి జేఎస్ క్లబ్, యోకో క్లబ్‌ల ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ జరిపాడు. కొంతకాలం లావాదేవీలు బాగానే జరిగాయి. ఇలా కానిస్టేబుల్‌కు మాయ మాటలు చెప్పి 25 లక్షల రూపాయలు
కట్టించుకున్నారు. తర్వాత సీన్ రివర్స్ అయింది.. క్లబ్‌ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీసిన కానిస్టేబుల్ తాను మోసపోయానని తెలుసుకున్నారు. గత నెల 9 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడుతున్న సమయంలో తెలంగాణలో
ఇలాంటి మోసానికి సంబంధించి చైనాకు చెందిన యాహూవో, రాజస్థాన్‌కి చెందిన ధీరజ్‌సర్కార్, అంకిత్కపూర్ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రాజంపేట పోలీసులు ఈ నెల 2న ఆ ముగ్గురిని రాజంపేటకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.