- Neti Charithra
Breaking... పులివెందుల లో ర్యాలీ చేసిన టీడీపీ "కీలక " నేత ను అరెస్ట్ చేసిన పోలీసులు..!
Breaking... పులివెందుల లో ర్యాలీ చేసిన టీడీపీ "కీలక " నేత ను అరెస్ట్ చేసిన పోలీసులు..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాలలో డిసెంబర్ 19న జరిగిన దళిత మహిళ హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీటెక్ రవి
(చెన్నై లో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి)
ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. అయితే హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేశారని.. తెదేపా నేతలు మాత్రం తమ పరువుకు భంగం వాటిల్లేలా ర్యాలీ నిర్వహించారంటూ దళిత మహిళ కుటుంబసభ్యులు ఆరోపించారు.
డిసెంబర్ 22న పోలీసులకు హత్యకు గురైన దళిత మహిళ తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీటెక్ రవి సహా 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా బిటెక్ రవి సమాచారం అందుకున్న కడపజిల్లా పోలీసులు
ఆయన్ను చెన్నైలో అరెస్ట్ చేశారు.