- Neti Charithra
Breaking.. పొలంలో బాంబు పేలుడు.. చిత్తూరు జిల్లా లోవైసీపీ నేత భార్య పరిస్థితి సీరియస్..!
Breaking.. పొలంలో బాంబు పేలుడు..
చిత్తూరు జిల్లా లోవైసీపీ నేత భార్య పరిస్థితి సీరియస్..!
కలికిరి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కలికిరి మండలం లో నాటు బాంబు పేలి ఓ వైసీపీ నాయకుని భార్య
గాయపడటం కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. కలికిరి మండలం మర్రికుంటా పల్లె పంచాయతీ విరులవాండ్ల పల్లె కు చెందిన వైసీపీ నేత మద్దిరాళ్ల మల్లికార్జున భార్య నాగవేని పొలం పనుల్లో ఉండగా అక్కడ ఓ నాటు బాంబు పేలి ఆమె గాయపడింది.
(బాంబు పేలి గాయపడ్డ వైసీపీ నేత భార్య)
పరిస్థితి ఆందోళన కరం గా మారటం తో ఆమెను తిరుపతికి తరలించారు. ఘటన స్థలం లో మరో నాటు బాంబును వాల్మీకి పురం పోలీసులు గుర్తించారు. కాగ తనను
రాజకీయంగా అంతం మొందించాలని కొందరు బాంబులను ఉపయోగించినట్లు వైసీపీ నాయకుడు మల్లికార్జున సీఐ నాగార్జునరెడ్డి కి ఎస్ ఐ చంద్రమోహన్ లకు ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది.
578 views0 comments