• Neti Charithra

Breaking.. పొలం రికార్డులు మార్చేందుకు.. లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మహిళా రెవిన్యూ అధికారి..!


Breaking.. పొలం రికార్డులు

మార్చేందుకు.. లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మహిళా రెవిన్యూ అధికారి..!



శ్రీకాకుళం: నేటి చరిత్ర


వ్యవసాయ పొలం ఆన్ లైన్ చేసేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసి ఓ మహిళా రెవిన్యూ అధికారిని ఏసీబీ కి చిక్కిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చైతు చేసుకుంది. ఏసీబిడీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్‌పండా కొంతకాలం కిందట మృతి చెందారు. అతని పేరున బుడార్శింగి గ్రామ పరిధిలో 67 సెంట్లు భూమి ఉంది. దానిని తన పేరున బదిలీ చేయించుకొనేందుకు అతని కుమారుడు రాజేష్‌పండా పదిరోజుల కిందట సోంపేట మండలంలోని కొర్లాం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకొన్నాడు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తు బుడార్శింగి గ్రామ వీఆర్వో బాడ రేణుకారాణి వద్దకు వెళ్లింది. ఆమె మ్యుటేషన్‌ చేయాలంటే రూ.3 వేలు లంచం ఇవ్వాలని రాజేష్‌ను డిమాండు చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోమందస తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న వీఆర్వో రేణుకారాణికి రూ.3 వేలు లంచం ఇస్తుండగా అక్కడే ఉన్న అధికారులు పట్టుకొన్నారు.లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వోను గురువారం విశాఖలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.