- Neti Charithra
Breaking.. పోలవరం వద్ద ప్రమాదం... నీటి మడుగులో పడి ఒకరు మృతి..!
Breaking.. పోలవరం వద్ద ప్రమాదం... నీటి మడుగులో పడి ఒకరు మృతి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతంస్పిల్వే వద్ద పనులు చేస్తున్న బిహార్‌కు చెందిన మహమ్మద్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు జారి
పడ్డాడు.స్పీడ్ ఛానల్లో ఉన్న నీటిలో పడటంతో గల్లంతయ్యాడు. చాలా సేపు తర్వతమృతదేహాన్ని గుర్తించారు.
కార్మికుడి మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ప్రస్తుతం ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు
నిలిపివేశారు. కార్మికుడి మృతదేహాన్ని శనివారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కార్మికుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
182 views0 comments