• Neti Charithra

Breaking.. పారిశ్రామిక వాడ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..!


Breaking.. పారిశ్రామిక వాడ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తూర్పుగోదావరి జిల్లారమణయ్యపేట ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం లో భారీ అగ్నిప్రమాదం జరుగగా లక్షల్లో నష్టం జరిగింది.

బియ్యం సంచుల తయారీ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. సుమారు 30 మంది కార్మికులు పనిచేసే ఈ పరిశ్రమలో సాయంత్రం పనులు ముగించుకుని తాళాలు వేసి అందరూ బయటకు వెళ్లిన తర్వాత మంటలు చెలరేగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని 5 అగ్నిమాపక శకటాలు వచ్చి రాత్రి 10.30 గంటల వరకు సిబ్బంది


శ్రమించి మంటలను ఆర్పారు. గోదావరి ప్లాస్టిక్స్‌ పేరున రిజిష్ట్రేషన్‌ ఉన్న పరిశ్రమలో సుమారు 10 ఏళ్ల నుంచి శ్రీగంగా ఇండస్ట్రీస్‌ పేరుతో లీజుకు తీసుకుని సూరిబాబు అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం చూసి యజమాని స్పృహతప్పి పడి పోవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.




Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్