• Neti Charithra

Breaking.. ప్రియుడి.. శోభన రాత్రిని అడ్డుకున్న ప్రియురాలు.. చిత్తూరు జిల్లా లో కొత్తకోణం..!


Breaking.. ప్రియుడి..

శోభన రాత్రిని అడ్డుకున్న ప్రియురాలు.. చిత్తూరు జిల్లా లో కొత్తకోణం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


(అర్ధరాత్రి ప్రియుడి శోభన రాత్రిని అడ్డుకున్న ప్రియురాలు)


ప్రియుడు మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లగా ప్రియురా లు వెళ్లి శోభన రాత్రిని అడ్డుకున్న ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాని లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.పెద్దపంజాణి మండలం కెళవాతి గ్రామానికి చెందిన శ్రావణి (21), గంగవరం మండలం



(ప్రియుడి శోభన రాత్రిని అడ్డుకున్న యువతి)


మిట్టమీద కురప్పల్లి గ్రామానికి చెందిన గణేష్ (23) గత ఆరు సంవత్సరాలుగా పలమనేరు ఓ ప్రైవేటు కాలేజ్ లో చదువుకుంటు ప్రేమించుకున్నామని రెండు సంవత్సరాల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరి జాబ్ చేస్తున్నాని.





11నెలల క్రితం గణేష్ బెంగళూరులో శ్రావణి పనిచేసే కంపెనీలో ఉద్యోగంలోనికి చేరాడు.

వీరిద్దరు మరింత దగ్గరయ్యారు. మూడు నెలలుగా సహజీవనం చేశారు.

పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే మూడు నెలలుగా లాక్‌డౌన్‌ సమయంలో గణేష్ సొంత గ్రామానికి చేరుకున్నాడు.

గణేష్ బుధవారం గంగవరం మండలం కలగటురు గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న శ్రావణి గురువారం రాత్రి పెద్దపంజాణి మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై గణేష్ పై ఐపిసి సెక్షన్ 417, 420 కేసులు నమోదు చేశారు.

శ్రావణి అదే రోజు రాత్రి కలగటూరు గ్రామానికి వెళ్లి గణేష్ శోభనరాత్రి ని

అడ్డుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


935 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon