• Neti Charithra

Breaking.. ప్రేమించ లేదని .. యువతి పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన మానవ మృగం..!


Breaking.. ప్రేమించ లేదని .. యువతి పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన మానవ మృగం..!


విజయవాడ: నేటి చరిత్ర


ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమెపై పెట్రోల్ పోసి

సజీవ దహనం చేసిన ఘటన విజయవాడలో సంచలనం కలిగించింది.

పోలీసుల కథనం మేరకు..

కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ

కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తుంది. స్నేహితురాళ్లతో కలసి ఆసుపత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమ పేరుతో

వేధిస్తున్నాడు. దీనిపై ఆమె నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు, పోలీసులు ఆ యువకుణ్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెను ఏమీ చేయనని రాసిచ్చినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.


203 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon