• Neti Charithra

Breaking.. ప్రేమించిన ప్రియుడు.. మోసం చేస్తున్నాడని.. ప్రేమికుణ్ణి హత్య చేసిన ప్రియురాలు..!


Breaking.. ప్రేమించిన ప్రియుడు.. మోసం చేస్తున్నాడని.. ప్రేమికుణ్ణి హత్య చేసిన ప్రియురాలు..!



నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని.. మరో అమ్మాయి తో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానం తో ప్రియుణ్ణి ..ప్రియురాలు దారుణ హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా లి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామీణ సీఐ ఎం.సురేష్‌ కథనం మేరకు.

తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ


(ప్రియుణ్ణి హత్య చేసిన ప్రియురాలు)


నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. దీంతో కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై పొడిచింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్