• Neti Charithra

Breaking.. ప్రేమించుకున్నారు.. ఏడడుగులు..వేయాలనుకున్నారు..అంతలోప్రేమ జంట ..ఆత్మహత్య..!


Breaking.. ప్రేమించుకున్నారు.. ఏడడుగులు..వేయాలనుకున్నారు..అంతలోప్రేమ జంట ..ఆత్మహత్య..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)



ఆ..ఇద్దరు..యువతీ యువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. రెండు కుటుంబాల్లో పెద్దలు సహకారం లేకపోవడంతో చెరువులో దూకి ఆ ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడిన విషాదాన్ని నింపిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు కథనం మేరకు..

(చెరువు లో తేలిన ప్రేమికుల మృత దేహాలు)


కోదాడమండలం లో ప్రేమ జంట పెద్ద చెరువులో దూకి యువతీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోదాడ లక్ష్మీపురం కాలనీకి చెందిన యువకుడు, అదే ప్రాంతానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రేమ జంట అదృశ్యంపై ఇరు కుటుంబాల పెద్దలు వేర్వేరుగా కోదాడ

పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగ శుక్రవారం

కోదాడలోని పెద్దచెరువు కట్టపై దుస్తుల బ్యాగుఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలం లో లభించిన బ్యాగు లో

ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు, లక్ష్మీపురం గ్రామస్థులకు సమాచారం అందించారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి చెరువులోని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన తో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.