• Neti Charithra

Breaking..ప్రేమించు కున్న పాపానికి... యువకుణ్ణి.. దారుణంగా హత్య చేశారు..!


Breaking..ప్రేమించు కున్న పాపానికి... యువకుణ్ణి.. దారుణంగా హత్య చేశారు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


యువతి.. యువకుడు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు..

ఈ నేపథ్యంలో యువకుణ్ణి కొట్టి చంపిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 పోలీసుల కథనం మేరకు..

 పోతిరెడ్డిపల్లికి చెందిన పద్మ, మొగిళి దంపతుల రెండో కుమారుడు ప్రణయ్‌(23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించగా.. కొద్ది రోజులుగా పంచాయితీలు నడిచాయి. సోమవారం రాత్రి యువతితో ఆమె ఇంటి వద్ద ప్రణయ్‌

మాట్లాడుతుండగా యువతి సోదరుడు అనిల్‌ అతనిపై కర్రతో దాడిచేశాడు. అనంతరం సమీపంలోని పొదల్లో యువకుడి మృతదేహాన్ని పడేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి ఇంటి సమీపంలో పరిశీలించగా రక్తపు మరకలు కనిపించాయి. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్