• Neti Charithra

Breaking... ప్రేమించుకున్న...ఇద్దరు మైనర్లు..ఆత్మహత్య..రెండు కుటుంబాల్లో విషాదం..!


Breaking... ప్రేమించుకున్న...ఇద్దరు మైనర్లు..ఆత్మహత్య..రెండు కుటుంబాల్లో విషాదం..!



నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా ర్మూర్‌ పట్టణ పరిధిలోని పెర్కిట్‌ శివారులో ప్రేమజంట ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణానికి చెందిన అమ్మాయి(18), వేల్పూర్‌ మండలానికి చెందిన బాలుడు(17) రెండేళ్లుగా

ప్రేమించుకొన్నారు. యువతి ఆర్మూర్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బాలుడు హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఓ పరీక్ష కేంద్రంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల్లో ప్రేమ వ్యవహారం తెలియడంతో భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. వివరాలు ఆరా తీసిన పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్‌



ఇచ్చి బాలుడిని అక్కడి నుంచి పంపించారు. యువతిని ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. వారు వెళ్లిపోగానే తిరిగి కలుసుకొన్న బాలుడు, యువతి పెర్కిట్‌ శివారులోని మామిడి తోటలో

ఆత్మహత్య కు పాల్పడ్డారు.