• Neti Charithra

Breaking.. ప్రేమలో పడ్డాడు.. శవమై తేలాడు.. చిత్తూరు జిల్లా యువకుడు మృతి..!


Breaking.. ప్రేమలో పడ్డాడు.. శవమై తేలాడు.. చిత్తూరు జిల్లా యువకుడు మృతి..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బాలాజీ విజయవాడ లోని కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తవనం పల్లె కు చెందిన

బత్తయ్య, హైమావతి దంపతులకు

బాలాజీ (32) కుమారుడు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన బాలాజీ తమిళనాడులోని ఓ హోటల్‌లో పని చేశాడు. అనంతరం విశాఖ చేరుకొని ఓ హోటల్లో పనికి చేరాడు. అదే సమయంలో తాడిచెట్లపాలెంకు చెందిన ఓ బాలిక(17)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు బాలికను విజయవాడలోని ఓ హాస్టల్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న బాలాజీ కూడా విజయవాడకు మకాం మార్చాడు. కొద్ది రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో బాలిక కృష్ణా జిల్లా పమిడిముక్కలకు చెందిన మరో యువకుడితో ప్రేమలో పడి అతడ్ని కూడా పెళ్లాడింది. ఈ క్రమంలో బాలాజీ నుంచి ఆమెకు వేధింపులు అధికమయ్యాయి. ప్రేమ వ్యవహారంపై పమిడిముక్కల యువకుడితో గొడవకు దిగాడు. దీంతో వివాదం అక్కడి పోలీసుల దృష్టికి వెళ్లింది. బాలాజీతోపాటు బాలికను పిలిపించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో బాలికను ఆమె తల్లిదండ్రులు విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంట్లో ఉంచారు. ఆ విషయాన్ని కూడా తెలుసుకున్న బాలాజీ గత ఏడాది డిసెంబర్‌లో బాలిక ఉంటున్న భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు మరో మారు అతన్ని కౌన్సిలింగ్ చేశారు. ఈ నేపథ్యం లో తన ప్రేమ విఫలం అయ్యిందని యువకుడు బాలాజీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

730 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon