- Neti Charithra
Breaking.. ప్రమాదం అంచున వీరప్ప నాయుని చెరువు..బి కొత్తకోట అధికారులు స్పందించాలి..!
Breaking.. ప్రమాదం అంచున వీరప్ప నాయుని చెరువు..బి కొత్తకోట అధికారులు స్పందించాలి..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గట్టు గ్రామం పరిధిలో ని విరప్పనాయుని చెరువు కు గండి పడింది. ఎగువన ఉన్న చెరువులు మొరవ వెళుతుండటం తో
ఇప్పటికే వర్షం నీటితో నిండిన వీరప్ప నాయుని చెరువు లోకి భారీగా మొరవ నీరు వస్తుండటం తో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు ఇప్పటికే ఈ చెరువు కట్ట బలహీనంగా
ఉండగా తాజాగా ఆదివారం ఇదే చెరువుకు గండి పడి నీళ్లు వృధా అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేయాలని ఆయకట్టు దారులు కోరుతున్నారు.
810 views0 comments