• Neti Charithra

Breaking.. ప్రముఖ నటి ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం..!


Breaking.. ప్రముఖ నటి ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ప్రముఖతమిళ టివి నటి విజె చిత్ర

బుధవారం ఉదయం ఆత్మహత్య

కు పాల్పడింది. కొంత కాలంగా తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా తనకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజె చిత్ర వయసు 28 ఏళ్లు. పాండియన్‌ స్టోర్స్‌ అనే పాపులర్‌ షోలో ముల్లై పాత్ర ద్వారా ఆమెకు భారీగా క్రేజ్‌ వచ్చింది. ఈమె

నజరేత్‌పేట్టైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఉరివేసుకున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపింది. విజె చిత్ర ఇవిపి ఫిల్మ్‌ సిటీలో మంగళవారం షూటింగ్‌ ముగించుకొని హోటల్‌ రూమ్‌కు వెళ్లింది. గ‌దికి తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు వ‌చ్చింద‌ని, ఉద‌యానికి ఉరివేసుకొని క‌న‌ప‌డింద‌ని హోట‌ల్ సిబ్బంది చెబుతున్నారు. ఆ హోటల్‌లో తనకు కాబోయే భర్త హేమంత్‌తో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.