• Neti Charithra

Breaking.. ప్రభుత్వ మద్యం షాపును.. అర్ధరాత్రి.. దుండగులు దోచుకెళ్లారు..!


Breaking.. ప్రభుత్వ మద్యం షాపును..

అర్ధరాత్రి.. దుండగులు

దోచుకెళ్లారు..!


నెల్లూరు: నేటి చరిత్ర


ప్రభుత్వ మద్యం షాపు తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు

భారీగా మద్యం బాటిళ్లను దోచుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా లో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు..

ముత్తుకూరు మండలం

బ్రహ్మదేవి పంచాయతీ జెన్‌కో రోడ్డులోని ప్రభుత్వం దుకాణంను నిర్వహిస్తోంది. రోజు మాదిరిగా మంగళవారం రాత్రి దుకాణాన్ని పర్యవేక్షకులు మూసేశారు. అయితే

బుధవారం ఉదయం మాస్కులు ధరించిన ముగ్గురు వచ్చి మద్యం కావాలని వాచ్‌మెన్‌ ప్రసాద్‌ను అడిగారు. లేవని చెప్పడంతో దోమతెరతో అతని కాళ్లు కట్టేసి షట్టరును గడ్డపారలతో పైకిలేపారు. రూ.4.80లక్షల విలువైన 806 బాటిళ్ల మద్యం చోరీ చేశారు. ట్రక్కు ఆటో, రెండు ద్విచక్రవాహనాల్లో పరారయ్యారు. అధికారులకు వాచ్‌మెన్‌ సమాచారం అందించారు. మద్యం డిపో మేనేజర్‌ వెంకట్రామిరెడ్డి, ఎస్సై వీరరాఘవయ్య వచ్చి పరిశీలించారు.