• Neti Charithra

Breaking.. ప్రయివేటుపాఠశాలల పై కన్నెర్ర చేసిన ప్రభుత్వం.. 259 పాఠశాల గుర్తింపు రద్దు..!


Breaking.. ప్రయివేటుపాఠశాలల పై కన్నెర్ర చేసిన ప్రభుత్వం.. 259 పాఠశాల గుర్తింపు రద్దు..!


అమరావతి: నేటి చరిత్ర


రాష్ట్ర వ్యాప్తంగా రెన్యూవల్‌ చేసుకోని 259 ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వీటికి సంబంధించి 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని, రెన్యూవల్‌ చేసుకోని కారణంగా వాటి గుర్తింపును రద్దు చేస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా, సదరు పాఠశాలల్లో వసతుల కల్పనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. దీంతో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌ను స్వీకరించబోమని స్పష్టం చేశారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్