• Neti Charithra

Breaking.. ప్రభుత్వ పాఠశాలలో జూదం ఆడుతూ పట్టుపడ్డ ప్రముఖులు..14 మంది అరెస్ట్..!


Breaking.. ప్రభుత్వ పాఠశాలలో జూదం ఆడుతూ పట్టుపడ్డ ప్రముఖులు..14 మంది అరెస్ట్..!తనకల్లు: నేటి చరిత్రఅనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్ట పల్లి ఉన్నత పాఠశాల అవరణం లో జూదం ఆడుతున్న 14 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున నగదు ను సీజ్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగుట్ల పల్లె హైస్కూల్ లో

నక్కా ముట్టి (జూదం)ఆడుతున్న

సమాచారం అందుకున్న పోలీసులు ముకుమ్మడి దాడులు చేశారు . ఈ సందర్భంగా జూదం ఆడుతున్న

14 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 12 సెల్ ఫోన్లు, 1,54,360 రూపాయలు నగదు ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుపడి న

వారిలో ఒక ప్రముఖ పార్టీ కి చెందిన MPTC కి పోటీ చేసిన అభ్యర్థి, ఒక న్యాయవాది, ఒక టమోటో మండి యజమాని, ఒక పెట్రోల్ బంక్ యజమాని ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపి నట్లు కదిరి సీఐ తమ్మిశెట్టి మధు, ఎస్ ఐ శ్రీనివాసులు మీడియా కు తెలిపారు.