- Neti Charithra
Breaking.. చదువుకుంటామని.. వెళ్లి.. ప్రభుత్వ కళాశాలలో పెళ్లిచేసుకున్న మైనర్లు..!
Breaking.. చదువుకుంటామని.. వెళ్లి..
ప్రభుత్వ కళాశాలలో పెళ్లిచేసుకున్న మైనర్లు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు మైనర్లు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్న సంఘటన విద్యాశాఖలో కలకలం రేపుతోంది.
వీరి వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు ఇటీవల తరగతి గదిలోనే వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి స్నేహితులతో పంచుకున్నారు. పిల్లలు చేసిన పని అందరికీ తెలియడంతో
ఇరువురి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై జిల్లా వృత్తి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర రావు స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, విచారణ చేస్తామని చెప్పారు. వీరి ఇద్దరితో పాటు మరికొందరి పై చర్య తీసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.