• Neti Charithra

Breaking.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇచ్చిన ప్రభుత్వం..!


Breaking.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇచ్చిన ప్రభుత్వం..!



అమరావతి:నేటి చరిత్ర


ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చే నిర్ణయాలు ను ప్రభుత్వం తీసుకుంది.

2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేశారు.ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరవు భత్యాన్ని (DA) నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని

నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్