- Neti Charithra
Breaking.. పెను విషాదం.. హంద్రీనీవా కాల్వలో పడి.. తల్లీ.. కుమార్తె మృతి..!
Breaking.. పెను విషాదం..
హంద్రీనీవా కాల్వలో పడి.. తల్లీ.. కుమార్తె మృతి..!
అనంతపురం: నేటి చరిత్ర
తల్లీ.. కుమార్తె .. ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాల్వలో పడి మృతి చెందిన
ఘటన అనంతపురం జిల్లాల్లో విషాదాన్ని నింపింది. స్థానిక పోలీసుల కథనం మేరకు..
గుంతకల్లులోని జి.కొట్టాల సమీపంలో
సిఐటియు కాలనీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ విజరు కుమార్, అతని భార్య జి.రత్నమ్మ (38), కూతురు దివ్య (20)ముగ్గురు ఆదివారం మధ్యాహ్నం బట్టలు ఉతుక్కోవడాని జి.కొట్టాల దారిలోని హంద్రీనీవా కాలువకు వెళ్లారు.
ఇంతలో తల్లి కాలు జారి వెనక్కి పడిపోయింది. వెనుక ఉన్న కూతురు కూడా కాల్వలోకి పడిపోయింది. గట్టిగా కేకలు కూడా వేశారు. కాలువ గట్టు సమీపంలో ఉన్న భర్త వెంటనే కాలువలోకి దూకాడు. ఇద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్ళాక మరి కొందరు సాయంతో భార్యను గట్టుకు తీసుకొచ్చాడు. కుమార్తె గల్లంతయింది. వెంటనే భార్యను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే మఅతి చెందినట్లు తెలిపారు.