• Neti Charithra

Breaking.. పెను విషాదం... చెరువు లో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి..!


Breaking.. పెను విషాదం... చెరువు లో

ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి..!


నెల్లూరు: నేటి చరిత్ర



ఈ తకు వెళ్లి.. ఊపిరి ఆడక ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద

ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడం తో చెరువు లోఈతకు వెళ్లి నిన్న ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. చెరువుగట్టుపై దుస్తులు చూసి వారు

గల్లంతైనట్లు స్థానికులు గుర్తించారు. రాత్రి నుంచి గాలింపు వెంకటాచలం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం ముగ్గురి మృతదేహాలను చెరువు నీటిలో తేలియాడటం చూసారు. స్టానికుల సహయంతో పోలీసులు మృతదేహాలను బైటకు తీశారు. మృతులు ఎస్‌.కె.అలీం(13), పి.సాయి(13), ఎం.రాజేశ్‌(13) లు. మృతులు బుజబుజనెల్లూరు వాసులుగా గుర్తించారు.