• Neti Charithra

Breaking... పెను విషాదం... ఈ తకు వెళ్లారు.. నలుగురు మృతి చెందారు..!


Breaking... పెను విషాదం... ఈ తకు వెళ్లారు.. నలుగురు మృతి చెందారు..!
పెనుగొండ: నేటి చరిత్ర


అనంతపురం జిల్లాలోని పెనుకొండలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది. పోలీసుల కథనం మేరకు..

అనంతపురం పట్టణంలోని సూర్యానగర్‌కు చెందిన నలుగురు వ్యక్తులు పెనుకొండ పరిధిలోని భోగసముద్రం చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారంతా అందులో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువు నుంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. వారు తస్లీమా(14), సాధిక్(40), అల్లాబక్ష్(45), పాషా (17)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో అనంతపురం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.