• Neti Charithra

Breaking.. పాద చారులపై దూసుకెళ్లిన వాహనం.. ఘోర ప్రమాదం లో ఇద్దరు మృతి..!


Breaking.. పాద చారులపై దూసుకెళ్లిన వాహనం.. ఘోర ప్రమాదం లో

ఇద్దరు మృతి..!



నెల్లూరు: నేటి చరిత్ర


జాతీయ రహదారి పై నడిచి వెళుతున్న పాద చారులపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు..

సూళ్లూరు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై హోలీక్రాస్‌ కూడలి వద్ద ఇద్దరు పాదచారులు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు 35, మరొకరు 45 ఏళ్ల వయసు వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అయితే వీరి చిరునామా లు గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్